KTR: పుట్టినరోజు.. కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ (వీడియో)

KTR Birthday KCR Blessings with Padabhishekam Video
  • భార్య, కుమారుడితో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేటీఆర్
  • తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో
  • అంతకుముందు తెలంగాణ భవన్‌లో పుట్టినరోజు వేడుకలు
  • కేటీఆర్ 'సీఎం.. సీఎం' అంటూ కార్యకర్తల నినాదాలు
తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకున్న కేటీఆర్ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. శైలిమ కూడా అత్తమామల పాదాలకు నమస్కరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు కుమారుడికి జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు దీవించారు. కేసీఆర్ దంపతులకు కేటీఆర్ దంపతులు పాదాభివందనం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‍‌గా మారింది.

సీఎం సీఎం అంటూ నినాదాలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలి వచ్చి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కేటీఆర్ కారు దిగి తెలంగాణ భవన్‌లోకి వెళ్లే సమయంలో అభిమానులు, కార్యకర్తలు 'సీఎం.. సీఎం' అంటూ నినాదాలు చేశారు.
KTR
K T Rama Rao
KCR
Kalvakuntla Taraka Rama Rao
BRS
BRS Party
Telangana

More Telugu News