గజరాజు ఆగ్రహానికి సీఈవో బలి
- దక్షిణాఫ్రికాలో విషాద ఘటన
- గోండ్వానా గేమ్ రిజర్వ్ లో ఏనుగులను అవతలికి తోలే ప్రయత్నం చేసిన సీఈవో
- ఓ ఏనుగు సీఈవోపైకి దూసుకొచ్చి తొక్కి చంపిన వైనం
దక్షిణాఫ్రికాలో విషాద ఘటన జరిగింది. ఓ గేమ్ రిజర్వ్ సీఈవో ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికాలో ఉన్న ఫైవ్ స్టార్ గేమ్ రిజర్వ్ లలో గోండ్వానా గేమ్ రిజర్వ్ ఒకటి. అక్కడ అనేక క్రూర మృగాలు ఉంటాయి. దీని సహ యజమానుల్లో ఎఫ్ సీ కాన్రాడ్ ఒకరు. ఆయనే సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నారు.
అయితే, గేమ్ రిజర్వ్ లోని పర్యాటకుల వసతి గృహాల వద్దకు వచ్చిన ఏనుగుల గుంపును కాన్రాడ్ అవతలికి తోలే క్రమంలో, ఒక ఏనుగు అదుపుతప్పింది. ఆయనపైకి దూసుకొచ్చి పలుమార్లు కాలితో తొక్కి చంపింది. గేమ్ రిజర్వ్ రేంజర్లు కాపాడే ప్రయత్నం చేసినా, ఏనుగు ఆగ్రహానికి వెనుకంజ వేశారు. 2024లో కూడా ఇదే గేమ్ రిజర్వ్ లో ఒక ఉద్యోగి ఏనుగు దాడిలో మరణించాడు.