రష్యా విమానం కూలిపోయింది.. శకలాలు గుర్తింపు.. వీడియో ఇదిగో!
- ప్రమాద సమయంలో ఐదుగురు చిన్నారులు సహా 49 మంది
- ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడినట్లు తెలియలేదన్న అధికారులు
- ఘటనా స్థలంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది. ఇందులో ఐదుగురు చిన్నారులతో పాటు మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారు. టిండాలోని ఎయిర్ పోర్టులో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యారని సమాచారం. ఎయిర్ పోర్ట్ చుట్టూ తిరిగి మరోమారు ల్యాండింగ్ కు పైలట్ ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు.