Russia Plane Missing: 50 మందితో వెళుతున్న‌ ర‌ష్యా విమానం అదృశ్యం

Russia Plane Carrying 50 Missing Near China Border
  • అంగారా విమాన‌యాన సంస్థ‌కు చెందిన ప్ర‌యాణికుల‌ విమానం
  • ర‌ష్యాకు తూర్పువైపు ఉన్న చైనా స‌రిహ‌ద్దులో విమానం గ‌ల్లంతు
  • అందులో 50 మంది ప్ర‌యాణికులు, విమాన సిబ్బంది
ర‌ష్యాలోని అంగారా విమాన‌యాన సంస్థ‌కు చెందిన ప్ర‌యాణికుల‌ విమానం ఒక‌టి అదృశ్యమైంది. ర‌ష్యాకు తూర్పువైపు ఉన్న చైనా స‌రిహ‌ద్దులో ఈ విమానం గ‌ల్లంతైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అందులో 50 మంది ప్ర‌యాణికులు, విమాన సిబ్బంది ఉన్న‌ట్లు స‌మాచారం. 

చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళుతుండ‌గా క‌నిపించ‌కుండా పోయింది. గ‌మ్య‌స్థానానికి మ‌రికొద్ది సేప‌ట్లో చేరుతుంద‌న‌గా... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్స్‌తో సంబంధాలు తెగిపోయిన‌ట్లు మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.   
Russia Plane Missing
Angara Airlines
missing plane
China border
Amur region
aviation accident
Tinda
Air traffic control

More Telugu News