Anil Kumar: మాజీ మంత్రి అనిల్‌కు పోలీసుల‌ నోటీసులు

Former Minister Anil Kumar Receives Police Notice
  • ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిని దూషించిన కేసులో మాజీ మంత్రి అనిల్‌కు నోటీసులు
  • ఎల్లుండి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌న్న కోవూరు పోలీసులు
  • ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో నివాసానికి నోటీసులు అంటించిన పోలీసులు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిని దూషించిన కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న ఉద‌యం 10 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో నివాసానికి కోవూరు ఎస్ఐ రంగ‌నాథ్ గౌడ్ నోటీసులు అంటించారు. కాగా, ఈ కేసులో ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.   
Anil Kumar
Anil Kumar YSRCP
Vemireddy Prashanthi Reddy
Kovur MLA
Nellore Politics
Andhra Pradesh Politics
YSRCP Leaders
Kovur Constituency
Police Investigation

More Telugu News