Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంపై సీఎం చంద్రబాబు స్పందన

Chandra Babu Wishes Pawan Kalyan for Hari Hara Veera Mallu Release
  • పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు
  • జులై 24న ప్రేక్షకుల ముందుకు
  • శుభాకాంక్షలు తెలిసిన సీఎం చంద్రబాబు
  • పవన్ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ సినిమా చేశారని వెల్లడి
  • ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్ష
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం రేపు (జులై 24) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 

"పవన్ కల్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కల్యాణ్ గారు చారిత్రక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారిగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు, 'ధర్మం కోసం యుద్ధం ప్రారంభం' అనే స్లోగన్ తో కూడిన హరిహర వీరమల్లు పోస్టర్ ను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Chandra Babu Naidu
AP Deputy CM
Telugu Movie
Historical Drama
Political News
Andhra Pradesh
Movie Release
Hari Hara Veera Mallu Movie

More Telugu News