Kollikuppi Srinivasarao: వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలవడంపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివరణ

Kollikuppi Srinivasarao clarifies meeting with YSRCP leader Peddireddy
  • ఎయిర్ పోర్టులో పెద్దిరెడ్డితో మాట్లాడిన కొలికపూడి
  • వీడియో వైరల్… తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం
  • పెద్దిరెడ్డిని మర్యాదపూర్వకంగానే పలకరించానని కొలికపూడి వెల్లడి
టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎయిర్ పోర్టులో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వైసీపీలో చేరుతున్నారా? అనే కోణంలో చర్చ జరిగింది. దీనిపై కొలికపూడి వివరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాము హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చామని, ఆ సందర్భంగా అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయాణించిందని వెల్లడించారు. దాంతో మర్యాదపూర్వకంగా, బాగున్నారా సార్ అని పలకరించానని, బాగున్నాను అని చెప్పి ఆయన వెళ్లిపోయారని, జరిగింది ఇదేనని అన్నారు. 

ఇక, తాను తిరుపతి టూర్ లో ఉన్పప్పుడే సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే వెంటనే అమరావతి వెళ్లిపోయానని కొలికపూడి స్పష్టం చేశారు. నిన్న, ఇవాళ కూడా తాను తిరువూరులో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని వెల్లడించారు. కానీ తాను రాజమండ్రిలో పెద్దిరెడ్డిని కలిసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని కొలికపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియో ఆధారంగా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని వాపోయారు. అదే... బొత్స, అయ్యన్నపాత్రుడు వాటేసుకుని మాట్లాడుకుంటున్న వీడియో బయటికి వచ్చినా దాని గురించి ఎవరూ మాట్లాడరని విమర్శించారు. ఎవరెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, తిరువూరు ప్రజలు నమ్మరని కొలికపూడి ఉద్ఘాటించారు.
Kollikuppi Srinivasarao
Peddireddy Ramachandra Reddy
TDP
YSRCP
Tirupati
Andhra Pradesh Politics
Tiruvuru
Telugu Desam Party
Political Meeting

More Telugu News