ఓటీటీకి మోహన్ లాల్ మూవీ!

  • మోహన్ లాల్ హీరోగా మలయాళ సినిమా
  • కామెడీడ్రామా జోనర్లో నడిచే కథ 
  • ఆరేళ్ల తరువాత ఓటీటీకి వచ్చిన సినిమా 
  • రేపాటు నుంచి ఈటీవీ విన్ లో

ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా నెల దాటగానే ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేస్తోంది. కొన్ని సినిమాలు నెల కూడా పూర్తి కాకముందే ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అయితే ఒక మలయాళ సినిమా మాత్రం ఆరేళ్ల తరువాత ఓటీటీకి సెంటర్ కి వచ్చేస్తోంది .. ఆ సినిమా పేరే 'ఇట్టిమాని: మేడిన్ చైనా'. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది.

జిబి - జోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో రాధిక .. హనీ రాజ్ .. సిద్ధికీ కనిపించనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన 2019లో ఈ సినిమాను విడుదల చేశారు. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 35 కోట్లకి పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మోహన్ లాల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. మలయాళంలో అప్పట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు పడతాయనేది చూడాలి.  



More Telugu News