చంద్రబాబు విజన్ నచ్చింది... అందుకే ఆరు నెలల్లోనే వచ్చాం: యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్

  • ఏపీ సీఎం చంద్రబాబుతో గత రాత్రి యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ భేటీ
  • ఏపీలో పెట్టుబడులపై విస్తృత చర్చ
  • నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమం
  • హాజరైన అబ్దుల్లా బిన్
  • దావోస్ లో చంద్రబాబుతో కేవలం 5 నిమిషాలే మాట్లాడానన్న యూఏఈ మంత్రి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ గత రాత్రి సమావేశం కావడం తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. 

ఇవాళ విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ కార్యక్రమంలోనూ యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేవలం 5 నిమిషాలు మాట్లాడాను. ఆయన విజన్‌, ఆలోచనా విధానం నాకు ఎంతగానో నచ్చాయి. అందుకే ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మేము సిద్ధమయ్యాం" అని వెల్లడించారు.

ఏపీలో యూఏఈ పెట్టుబడులతో పర్యాటక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News