Donald Trump: గ్రీన్‌లాండ్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్న డెన్మార్క్

Donald Trump Greenland military tensions rise between US and Denmark
  • అమెరికా కదలికల నేపథ్యంలో డెన్మార్క్ ప్రభుత్వం అప్రమత్తం
  • గ్రీన్‌లాండ్‌లో తన సైనిక బలగాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటన
  • గ్రీన్‌లాండ్ తన సొంత భూభాగమన్న డెన్మార్క్
  • దాని భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
  • ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న సైనిక మోహరింపులు
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో సైనిక కదలికలు వేగవంతమయ్యాయి. తాజాగా అమెరికా తన సైనిక విమానాలను గ్రీన్‌లాండ్ దిశగా పంపడం కలకలం రేపుతోంది. దీనిని తమ సార్వభౌమాధికారానికి ముప్పుగా భావిస్తున్న డెన్మార్క్.. గ్రీన్‌లాండ్‌లోని తన వ్యూహాత్మక స్థావరాల వద్ద సైనిక బలగాలను రెట్టింపు చేసింది.

"అమెరికా చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యంలో భాగం, దాని రక్షణకు మేము సిద్ధంగా ఉన్నాం" అని డెన్మార్క్ రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు, రష్యా, చైనా ప్రభావం ఈ ప్రాంతంలో పెరగకుండా ఉండాలంటే గ్రీన్‌లాండ్ అమెరికా నియంత్రణలో ఉండాలని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది.

తాజా నివేదికల ప్రకారం అమెరికా కేవలం విమానాలను పంపడమే కాకుండా, ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్న 10 శాతం దిగుమతి సుంకాలతో డెన్మార్క్‌పై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలు డెన్మార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా తన సైనిక విమానాల పంపకాన్ని "సాధారణ పర్యవేక్షణ" అని పేర్కొన్నప్పటికీ, అది గ్రీన్‌లాండ్ విమానాశ్రయాలను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
Donald Trump
Greenland
Denmark
United States
military
Arctic
geopolitics
import tariffs
military aircraft
sovereignty

More Telugu News