Election Commission: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం

Election Commission starts process to elect new Vice President
  • ధన్‌కడ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు
  • రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించడంలో ఈసీ బిజీ
  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఈసీ ఎన్నికల నిర్వాహణ‌
  • ఆ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు
జగదీప్‌ ధన్‌కడ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తు పూర్తవగానే ఎన్నికల షెడ్యూల్‌ను వెల్ల‌డించ‌నుంది. 

ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడంలో, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించడంలో ఎన్నికల సంఘం బిజీ అయిపోయింది. 

ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవి ఖాళీకాగానే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తోంది.

అనారోగ్య కారణాలతో తాను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ జగదీప్‌ ధన్‌కడ్ సోమ‌వారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా పంపారు. రాష్ట్రపతి నిన్న ఆయ‌న‌ రాజీనామాకు ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర హోంశాఖకు పంపారు. కేంద్ర హోంశాఖ ఉపరాష్ట్రపతి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని పార్లమెంట్ ఉభయసభలకు సభాధ్యక్షుల ద్వారా తెలియజేసింది.
Election Commission
Jagdeep Dhankhar
Vice President Election
Election Commission of India
Droupadi Murmu
Indian Constitution Article 324
Rajya Sabha
Parliament
Vice President Resignation
Central Home Ministry
Election Schedule

More Telugu News