తాలిపేరుకు భారీగా వరద.. వీడియో ఇదిగో!




భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరుతో పాటు చింత వాగు, పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. దిగువ గోదావరికి 28 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువ తేగడ వద్ద లో లెవల్ చప్టా నీటమునిగింది. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామచంద్రాపురం, బత్తినపల్లి, బట్టి గూడెం తదితర గ్రామాల్లో వాగులు పొంగుతున్నాయి.


More Telugu News