తోడు లేనందుకు బాధగానే ఉంది.. అయితే స్వేచ్ఛగా జీవించడం బాగుంది: నిత్యామేనన్
- జీవితంలో పెళ్లి ఓ భాగం మాత్రమే.. పెళ్లే జీవితం కాదన్న నటి
- జీవితంలో కొన్ని అనుభవాలతో పాఠాలు నేర్చుకున్నా..
- ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగాలంటూ వేదాంతం
చుట్టూ ఉన్న సమాజం, తల్లిదండ్రుల కారణంగా ఓ భాగస్వామి ఉండాల్సిందేనని అనిపించిందన్నారు. ఓ దశలో తగిన భాగస్వామి కోసం వెతికానని నిత్యామేనన్ చెప్పారు. అయితే, తనకు ఎదురైన కొన్ని అనుభవాలు జీవిత పాఠాలు నేర్పాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేరని, మనం వేరేరకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నానని తెలిపారు.
పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని, పెళ్లి జరిగినా, జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఏం జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగాలని నిత్యామేనన్ పేర్కొన్నారు.