Air India: హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు

Air India Flight Catches Fire After Landing in Delhi
  • పవర్ యూనిట్‌లో చెలరేగిన మంటలు
  • ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడి
  • విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిపిన ఎయిరిండియా
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315లో పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికి యాక్సిలరీ విద్యుత్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండ్ అయిన కాసేపటికి పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా దిగారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. తదుపరి విచారణ కోసం విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిరిండియా తెలిపింది.
Air India
Air India fire
Delhi Airport
Hong Kong to Delhi
AI 315
Aircraft fire
Auxiliary Power Unit
Flight safety

More Telugu News