‘వార్ 2’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్

  • హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’
  • య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణం.. అయాన్ ముఖర్జీ డైరెక్ట‌ర్‌
  • ఆగస్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా 
  • ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ నెల‌ 25న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్‌ ప్ర‌క‌ట‌న‌
బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ న‌టుడు జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వార్ 2’. య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య‌చోప్రా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఇక‌, ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మేక‌ర్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ నెల‌ 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌కటించారు.

కాగా, దాదాపు 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌కు సీబీఎఫ్‌సీ.. ‘U/A’ (16+) సర్టిఫికేట్‌ను జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. 

హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, తార‌క్‌ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రం. 


More Telugu News