Lenildo Frazao: జర్నలిస్ట్ భయానక అనుభవం.. బాలిక మిస్సింగ్‌పై నదిలో రిపోర్టింగ్ చేస్తూ ఆమె మృతదేహంపైనే అడుగు.. వీడియో ఇదిగో!

Brazil Journalist Lenildo Frazao Finds Missing Girl Raisas Body
  • బ్రెజిల్‌లోని మిరియం నది ఒడ్డున ఘటన
  • స్నేహితులతో నదిలో ఈత కొడుతూ అదృశ్యమైన మియరిమ్
  • ఈ ఘటనను రిపోర్టు చేస్తున్న సమయంలో మృతదేహం గుర్తింపు
"నీటిలో ఏదో తాకినట్టు అనిపించింది.. అది ఆమె అయి ఉండొచ్చు!" బ్రెజిల్‌లోని మియా రిమ్ నది ఒడ్డున రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్ట్ లెనిల్డో ఫ్రజావో భయంతో గుర్తు చేసుకున్న మాటలివి. 13 ఏళ్ల బాలిక రైస్సా అదృశ్యమైన ఘటనను కవర్ చేస్తూ, నదిలో నీటి లోతు చూపిస్తున్న సమయంలో ఫ్రజావో అనుకోకుండా ఆమె మృతదేహంపై అడుగు వేశాడు. ఊహించని ఈ భయానక ఘటన స్థానికులను మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో వీడియో చూసిన వారిని కూడా షాక్‌కు గురిచేసింది.

జూన్ 29న, రైస్సా అనే బాలిక తన స్నేహితులతో కలిసి మియా రిమ్ నదిలో ఈత కొడుతూ అదృశ్యమైంది. స్థానిక మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్న రైస్సా ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ ఘటనను కవర్ చేసేందుకు జర్నలిస్ట్ లెనిల్డో ఫ్రజావో మియా రిమ్  నదిలోకి దిగారు. నీరు ఛాతి వరకు ఉన్న ప్రాంతంలో నడుస్తూ, నది లోతు, రైస్సా ఈత కొట్టిన ప్రదేశాన్ని ప్రేక్షకులకు వివరిస్తుండగా, అకస్మాత్తుగా నీటి అడుగున ఏదో తాకినట్టు గ్రహించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

"నీటి అడుగున ఏదో ఉన్నట్లుంది" అని ఆయన కెమెరా బృందంతో అన్నారు. "అది చేయి లాగా అనిపించింది... ఆమెదా? లేక చేపా? తెలియదు" అని భయంతో వెనక్కి వచ్చారు. ఈ మాటల్లోనే ఆయన అనుభవించిన తీవ్ర మానసిక ఆందోళన స్పష్టంగా కనిపించింది.
 
ఫ్రజావో అనుమానం నిజమైంది. ఆయన తక్షణమే రెస్క్యూ బృందాలకు ఈ సంఘటనను తెలియజేశారు. మరుసటి రోజు జూన్ 30న ఉదయం ఫైర్‌ఫైటర్స్,  డైవర్లు నిర్వహించిన శోధనలో ఫ్రజావో నిలబడిన చోటనే రైస్సా మృతదేహం లభించింది. పోస్ట్‌మార్టం పరీక్షలో రైస్సా శరీరంపై ఎలాంటి హింస జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ఆకస్మికంగా నీటిలో మునిగిపోవడమే ఆమె మరణానికి కారణమని నిర్ధారించారు. రైస్సా మృతదేహాన్ని జూన్ 30న సాయంత్రం ఖననం చేశారు.
Lenildo Frazao
Brazil
Mearim River
missing girl
drowning
journalism
reporting
Raisa
Mearim River Brazil

More Telugu News