F-35 Fighter Jet: ఐదు వారాల తర్వాత ఎట్టకేలకు ఎగిరింది.. ఎఫ్-35 ఫైటర్ జెట్ వీడియో ఇదిగో!
బ్రిటన్ కు చెందిన ఎఫ్ -35 యుద్ధ విమానం సాంకేతిక సమస్యతో కేరళ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. బ్రిటన్ నుంచి నిపుణులను రప్పించి మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఐదు వారాలుగా తిరువనంతపురం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. తాజాగా ఈ యుద్ధ విమానం గాల్లోకి లేచింది. బ్రిటన్ నుంచి వచ్చిన నిపుణులు విమానంలో ఏర్పడిన సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. దీంతో ఐదు వారాల తర్వాత ఈ యుద్ధ విమానం గాల్లోకి ఎగిరింది.
హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా పైలట్ ఈ విమానాన్ని జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. కొన్ని రోజుల పాటు రన్ వే పైనే ఉన్న ఈ విమానం తర్వాత విమానాశ్రయం షెడ్డుకు చేరింది. బ్రిటన్ నుంచి నిపుణులు వచ్చి మరమ్మతులు చేసినా ఉపయోగం లేకపోయింది. చివరకు రాయల్ నేవీ టీమ్ వచ్చి రిపేర్లు పూర్తిచేసింది. తాజాగా విజయవంతంగా గాల్లోకి ఎగరడంతో ఈ విమానాన్ని బ్రిటన్ కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.