Sajjanar: వైరల్ వీడియోపై సజ్జనార్ స్పందన.. ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అవసరమని వ్యాఖ్య

Sajjanar criticizes youth performing dangerous railway stunt for social media
  • రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్న యువకుడు
  • యువత ప్రమాదకర పనులు చేస్తున్నారన్న సజ్జనార్
  • ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి లేదని మండిపాటు
సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి నెలకొంది. వెరైటీ రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఓ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్... తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

"పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!? సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండటం లేదు. సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని భావించి.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉంది" అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
Sajjanar
TSRTC MD
viral video
railway track stunt
social media craze
counseling
youth
dangerous stunts
train accident
public safety

More Telugu News