బీచ్ ఒడ్డున ఖరీదైన కారుతో స్టంట్లు.. మట్టిలో కూరుకుపోయిన కారు.. వీడియో ఇదిగో!




కారు స్టీరింగ్ దొరికితే యువతకు పట్టాపగ్గాలుండవు.. అందులోనూ ఖరీదైన కారైతే వారు చేసే విన్యాసాల గురించి చెప్పనక్కర్లేదు. గుజరాత్ కు చెందిన ఓ యువకుడు కూడా మెర్సిడెస్ బెంజ్ కారుతో స్టంట్లు చేయడానికి ప్రయత్నించి ఘోరంగా దెబ్బతిన్నాడు. పోలీసుల కళ్లుగప్పి బీచ్ లోకి కారును తీసుకెళ్లి నీళ్లలో నడిపేందుకు ప్రయత్నించగా.. కారు కాస్తా బురదలో కూరుకుపోయింది. దీంతో అతికష్టమ్మీద యువకుడు బయటపడ్డాడు.

కారును బయటకు తీయడం మాత్రం అతడి వల్ల కాలేదు. సూరత్ లోని డుమాస్ బీచ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోలీసుల దాకా చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీచ్ లోకి వాహనాల ఎంట్రీపై నిషేధం విధించినా, నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నా సదరు యువకుడు కారుతో బీచ్ లోకి ఎలా ప్రవేశించాడని పోలీసులు విచారిస్తున్నారు.


More Telugu News