ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా పేర్ల‌న్నింటితో కీర‌వాణి స్పెష‌ల్ సాంగ్.. ఇదిగో వీడియో!

  • నిన్న శిల్పాక‌ళావేదిక‌లో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • త‌న అర్ధాంగి అన్నా లెజినోవాతో క‌లిసి ఈవెంట్‌కు హాజ‌రైన ప‌వ‌న్‌
  • పవన్ సినిమా పేర్లన్నీ కలిపి ఓ స్పెషల్ సాంగ్ తయారుచేసి ప్ర‌ద‌ర్శించిన కీర‌వాణి
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న స్పెష‌ల్ సాంగ్
నిన్న శిల్పాక‌ళావేదిక‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప‌వ‌ర్ స్టార్‌ త‌న అర్ధాంగి అన్నా లెజినోవాతో క‌లిసి హాజ‌రు కావ‌డం విశేషం. ఇక,  ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పవన్ సినిమా పేర్లన్నీ కలిపి ఓ స్పెషల్ సాంగ్ తయారుచేసి ప్ర‌ద‌ర్శించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ సాంగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి నుంచి ఇప్ప‌టి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు వ‌రకు ప్ర‌తి సినిమాని ట‌చ్ చేస్తూ ఈ పాట‌ సాగింది. ఇప్పుడీ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

కాగా, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ఈ నెల‌ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ముఖ్యంగా రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్నారు. నిన్న ఉద‌యం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ప‌వ‌ర్‌స్టార్‌, సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు.



More Telugu News