నిమిష ప్రియ విడుద‌ల కాబోతోంది: కేఏ పాల్‌

  
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌జాశాంతి పార్టీ నేత కేఏ పాల్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. తాను నిమిష ప్రియ‌ను జైలు నుంచి విడిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని, ఆమె జైలు నుంచి విడుద‌ల కాబోతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

"బిగ్‌ బ్రేకింగ్ న్యూస్. యెమెన్ జైలులోని భారతీయ నర్సు నిమిష ప్రియ విడుదల కానుంది" అంటూ కేఏ పాల్ పోస్టు చేశారు. అయితే, నిమిష ప్రియ విడుద‌ల‌పై యెమెన్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. మ‌రోవైపు ఆమెను కాపాడడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  




More Telugu News