నేను కూడా 'హరిహర వీరమల్లు' కోసం వెయిటింగ్: రఘురామకృష్ణరాజు

  • హైదరాబాదులో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన రఘురామకృష్ణరాజు
  • ఏపీలో ఔరంగజేబులాంటివాడ్ని పవన్ ఓడించారని కితాబు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కూడా హాజరయ్యారు. 

ఈ వేడుకలో రఘురామ మాట్లాడుతూ... ‘ఆంధ్ర రాష్ట్రంలో ఔరంగజేబు లాంటి వాడిని ఓడించి గెలిచిన గొప్ప వ్యక్తి’గా పవన్ కల్యాణ్‌ను అభివర్ణించారు. ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ సత్తా చాటేందుకు హరిహర వీరమల్లు చిత్రంతో వస్తున్నాడని అన్నారు. అందరిలాగే తాను కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని రఘురామ తెలిపారు. పవన్ కల్యాణ్ మంచి నటుడే కాకుండా, వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంచివాడని కొనియాడారు. నాడు ఛత్రపతి శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారన్నది హరిహర వీరమల్లు సినిమా ద్వారా చూడబోతున్నామని వివరించారు.

పవన్ ఏం చెబుతారో, అదే పాటిస్తారు: మంత్రి కందుల దుర్గేశ్

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... పవన్ కల్యాణ్ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి అని, తాను ఏం చెబుతాడో అదే పాటిస్తారని కొనియాడారు. హీరోగా ఎంతో కెరీర్ ఉన్నప్పటికీ పేదల కన్నీళ్లు తుడిచేందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు. పవన్ కల్యాణ్ వల్లే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన వల్లే మంత్రినయ్యానని వినమ్రంగా తెలిపారు. జాతీయ వాదం ప్రధాన అంశంగా హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందని అన్నారు. 


More Telugu News