సర్ఫరాజ్ స్లిమ్‌గా మారడంపై స్పందించిన కేపీ... ఆ క్రికెటర్‌కు చెప్పాలని సూచన
- రెండు నెలల కాలంలో 17 కిలోలు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్
- జాతీయ జట్టుకు ఆడాలనే సర్ఫరాజ్ సంకల్పం తనకు నచ్చిందన్న పీటర్సన్
- పృథ్వీ షాకు ఎవరైనా చూపిస్తే అతను కూడా ఇలా మారవచ్చని వ్యాఖ్య
భారత క్రికెట్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ రెండు నెలల్లో 17 కిలోల బరువు తగ్గి సన్నబడటంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. సర్ఫరాజ్ ఖాన్ తిరిగి టెస్టుల్లో స్థానం సంపాదించేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సర్ఫరాజ్ సన్నగా మారడంపై పీటర్సన్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఫిట్‌నెస్ సమస్య కారణంగా జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువ బ్యాట్స్ మన్ పృథ్వీ షా గురించి కూడా కేపీ ప్రస్తావించాడు. సర్ఫరాజ్ ఎలా స్లిమ్ గా మారాడో పృథ్వీ షాకు చూపించాలని పేర్కొన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ చేసిన ప్రయత్నం అద్భుతమని, అతడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పీటర్సన్ అన్నాడు. బరువు తగ్గడం మైదానంలో మరింత మెరుగైన, నిలకడైన ప్రదర్శన చేయడానికి తోడ్పడుతుందని తెలిపాడు. తిరిగి జాతీయ జట్టుకు ఆడాలనే సర్ఫరాజ్ సంకల్పం తనకు నచ్చిందని కొనియాడాడు. అదే సమయంలో, సర్ఫరాజ్ స్లిమ్ గా మారిన విషయం పృథ్వీ షాకు ఎవరైనా చెప్పాలని, అప్పుడు అతను కూడా ఇలా మారే అవకాశం ఉందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.