Krishna Devarayalu: జగన్ దురాగతాలను లోక్ సభలో బట్టబయలు చేస్తాం: ఎంపీ కృష్ణదేవరాయలు
- లిక్కర్ స్కామ్ పై లోక్ సభలో చర్చిస్తామన్న కృష్ణదేవరాయలు
- మిథున్ రెడ్డిని సిట్ విచారిస్తోందని వ్యాఖ్య
- ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఎంపీ
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణను సిట్ వేగవంతం చేసింది. మరోవైపు ఈ స్కామ్ పై లోక్ సభలో చర్చిస్తామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జగన్ చేసిన దురాగతాలను బట్టబయలు చేస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ విచారిస్తోందని తెలిపారు. పార్లమెంట్ లో రైతు సమస్యలు, పంట గిట్టుబాటు ధరలపై కూడా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.