Srinivas Goud: లిక్కర్ మాఫియాకు తలొగ్గారు: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

Srinivas Goud Warns Revanth Reddy Government on Liquor Mafia
  • కులవృత్తులను భూస్థాపితం చేయాలని చూస్తున్నారని ఆరోపణ
  • కల్లు దుకాణాలను బంద్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్న శ్రీనివాస్ గౌడ్
  • కుల వృత్తుల బాగోగులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న బీఆర్ఎస్ నేత
కులవృత్తులను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్తీ పేరిట పూర్తిగా గీత వృత్తిని రూపుమాపేయాలని దురాలోచన చేస్తోందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు దుకాణాలను బంద్ చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గౌడ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.

కుల వృత్తుల బాగోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆయన ఆరోపించారు. మొదట ఔటర్ రింగు రోడ్డు లోపల, ఆ తర్వాత ఔటర్ రింగు రోడ్డు బయట కల్లును నిషేధించాలని భావిస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. కల్లు కాంపౌండుపై నిషేధం విధిస్తే లక్షలాది మంది రోడ్ల మీద పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్లును బంద్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

లిక్కర్ కంపెనీలు, డిస్టిలరీలు అన్నీ ఒకరిద్దరు చేతుల్లోనే నడుస్తున్నాయని ఆయన అన్నారు. లిక్కర్ కంపెనీల కమీషన్లకు కక్కుర్తిపడి, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లు కాంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారని అన్నారు. కల్లులో మీరే ఏదో కలిపి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ కల్లును అరికట్టడంలో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను తెలంగాణలో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Srinivas Goud
Revanth Reddy
Telangana
Kallu
Liquor Mafia
Goud Community
Toddy Shops

More Telugu News