యూఏఈలో అనుమానాస్పద స్థితిలో కేరళ యువతి మృతి

  • షార్జాలో ఘటన
  • విగతజీవురాలిగా అతుల్య శేఖర్
  • వరకట్న మరణం అంటున్న పుట్టింటి వారు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో కేరళకు చెందిన 29 ఏళ్ల అతుల్య శేఖర్ అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కొల్లాంకు చెందిన అతుల్య శేఖర్ 2014లో సతీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. శనివారం షార్జాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. అతుల్య తల్లి ఆరోపణల ప్రకారం, తన అల్లుడు సతీష్ ఆమెను గొంతు నులిమి, కడుపులో తన్ని, తలపై ప్లేట్‌తో కొట్టాడని, దీని వల్ల ఆమె మరణించిందని తెలిపారు. పెళ్లయినప్పటి నుండి సతీష్ వరకట్నం కోసం అతుల్యను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వారు సతీష్‌కు 40 సవర్ల బంగారు నగలు మరియు ఒక బైక్ ఇచ్చారని చెప్పారు. కాగా, సతీష్‌పై హత్య కేసు నమోదైనట్టుతెలుస్తోంది.

ఇటీవలి కాలంలో వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్యలు లేదా మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నెల ప్రారంభంలో షార్జాలోనే కేరళకు చెందిన 32 ఏళ్ల మహిళ తన పసిబిడ్డతో సహా మృతి చెందగా, ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.



More Telugu News