Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ కు తొలగిన అడ్డంకులు

Hari Hara Veera Mallu Pre Release Event Gets Police Nod With Conditions
  • షరతులతో అనుమతిచ్చిన తెలంగాణ పోలీసులు
  • ఏం జరిగినా నిర్మాతే బాధ్యత వహించాలని కండీషన్
  • వెయ్యి నుంచి పదిహేను వందల మందితో నిర్వహించుకోచ్చని వెల్లడి
హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అడ్డంకులు తొలిగాయి. ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు తెలంగాణ పోలీసులు షరతులతో కూడిన అనుమతిచ్చారు. ఈవెంట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా మొత్తం బాధ్యత నిర్మాతదేనని కండీషన్ పెట్టారు. వెయ్యి నుంచి పదిహేను వందలమందితో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవచ్చని తెలిపారు.

ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా వేదిక వెలుపల జనాలను నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు. క్రౌడ్ కంట్రోల్ కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని చిత్ర యూనిట్ కు చెప్పారు. అన్ని రకాల జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లతో కార్యక్రమం నిర్వహించుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu Pre Release Event
Pawan Kalyan
Telangana Police
Movie Event
Hyderabad Event
Crowd Control
Film Promotion

More Telugu News