స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజ‌రైన అంబ‌టి రాంబాబు, విడ‌ద‌ల ర‌జిని

  • జ‌గ‌న్ రెంటపాళ్ల పర్యటన నేప‌థ్యంలో వైసీపీ నేత‌ల‌పై కేసు
  • ప‌ర్య‌ట‌న సమయంలో పోలీసుల‌తో వాగ్వాదం, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌
  • స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో 113 మంది వైసీపీ నేత‌ల‌పై కేసు న‌మోదు
  • తాజాగా విచార‌ణ‌కు హాజ‌రైన అంబ‌టి రాంబాబు, విడ‌ద‌ల ర‌జిని  
వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.  వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రయ్యారు.

ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజిని కూడా ఉన్నారు. దీంతో ఆమె కూడా తాజాగా స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మొత్తం 113 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటికే పలువురిని విచారించారు. 


More Telugu News