‘కాంతార జ‌ర్నీ’ బిగిన్స్‌.. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన మేక‌ర్స్

  • ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’
  • ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముగిసింద‌న్న‌ మేకర్స్ 
  • ‘కాంతార జ‌ర్నీ’ బిగిన్స్ అంటూ గ్లింప్స్‌ విడుద‌ల 
  • ‘కాంతార’ ప్రపంచం ఎలా ఉంటుందో వివరించిన రిషభ్‌ శెట్టి
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విడుద‌లైన అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ రిషభ్‌ శెట్టి తనదైన మార్క్ వేసుకున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా మేకర్స్ రూపొందించగా ఇందులోని వైవిధ్యమైన కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.

ఇక, ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ను తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఒక‌ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో ‘కాంతార జ‌ర్నీ’ బిగిన్స్ అంటూ ఒక గ్లింప్స్‌ను విడుద‌ల చేసి అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మేకింగ్ వీడియోలో కాంతార ప్రపంచం ఎలా ఉంటుందో రిషభ్‌ శెట్టి వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. 

కాంతార అంటే సినిమా కాదని.. తమ చరిత్ర అని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. ఇక వీడియోలో కాంతార చిత్రానికి సంబంధించిన విజువల్స్, భారీ మేకింగ్, క్యాస్టింగ్ త‌దిత‌ర వివ‌రాల‌ను చూపించారు. ఇది కేవ‌లం ఒక సినిమా కాదు.. ఒక శ‌క్తి అంటూ రిష‌భ్ త‌న జ‌ర్నీని వివ‌రించారు. మొత్తానికి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు కాంతార సిద్ధమవుతున్నట్లు ఈ గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.



More Telugu News