లిక్కర్ స్కామ్ లో జగన్ త్వరలోనే అరెస్ట్ అవుతారు: జ్యోతుల నెహ్రూ
- లిక్కర్ స్కామ్ కేసులో వేగం పెంచిన సిట్
- మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
- మిథున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న జ్యోతుల నెహ్రూ
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. వరుసగా కేసులు నమోదు చేస్తూ, నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పారు. మిథున్ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. రూ. 3,500ల కోట్ల మద్యం స్కామ్ లో వాటాలు తేలకపోవడంతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బయట పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. మద్యం పాలసీని కేబినెట్ మీటింగ్ లో ఆమోదించిన ప్రతి ఒక్కరినీ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు.