Viral Video: సరదాగా కారు డ్రైవ్ చేసిన‌ ఇద్ద‌రు పిల్లలు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!

Viral Video Kids Driving Car Crash Bikes in Haryana
  • పిల్ల‌లు కారుపై నియంత్రణ కోల్పోవ‌డంతో బీభ‌త్సం
  • త్రుటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం 
  • పలు ద్విచ‌క్ర‌వాహ‌నాలు ధ్వంసం
  • హర్యానాలో ఘటన.. నెట్టింట‌ వీడియో వైరల్
ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్‌ చేశారు. అయితే, కారుపై నియంత్రణ కోల్పోవ‌డంతో బీభ‌త్సం సృష్టించారు. వీధుల్లో కారు ప్రమాదకరంగా దూసుకెళ్లింది. ఒక ద్విచ‌క్ర‌ వాహ‌న‌దారుడు, కొందరు పిల్లలు త్రుటిలో ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట‌ వైరల్ అవుతోంది. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. 

వీడియోలోని దృశ్యాల ఆధారంగా... ఈ నెల‌ 16న ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ ఎస్‌యూవీ కారును ఇద్ద‌రు పిల్ల‌లు న‌డిపారు. అయితే, కారుపై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో అది అదుపులేకుండా వీధుల్లో దూసుకెళ్లింది. ఆ కారు తొలుత ప్రమాదకరంగా ఓ మలుపు తిరిగింది. ఆ త‌ర్వాత ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళుతున్న వ్యక్తి దగ్గర నుంచి దూసుకెళ్లింది. అయితే, అతడు త్రుటిలో తప్పించుకున్నాడు.

ఆ త‌ర్వాత కారు వీధిలోని పార్క్‌ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. అక్కడున్న పిల్లలు ఇది చూసి భయంతో పరుగులు తీశారు. చివరకు కారు టైర్ల ముందు ఒక ద్విచ‌క్ర‌వాహ‌నం పడింది. ఒక ఇంటి మెట్ల వద్ద అది అడ్డుపడటంతో చివరకు ఆ ఎస్‌యూవీ కారు ఆగింది. అలా కారు ఆగ‌డంతో అందులోంచి ఇద్దరు బాలురు కిందకు దిగారు. 

దాంతో ఆ కారును పిల్లలు డ్రైవ్‌ చేసినట్లు తెలుసుకుని స్థానికులు నిర్ఘాంత‌పోయారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో పలు ద్విచ‌క్ర‌వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 
Viral Video
Car Accident
Haryana
Kids Driving
Road Accident
Children Driving
Car Crash
Bike Damage
Traffic Incident

More Telugu News