కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఏపీఎస్డీఎంఏ అలర్ట్

  • ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు 
  • బ్యారేజీ వద్ద 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం
  • గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేసిన అధికారులు
భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు అధికంగా చేరుతోంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టంకు చేరడంతో, అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదల ఎప్పటికప్పుడు మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. బ్యారేజీ నుండి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నందున కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. నదిలో ప్రయాణాలు చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. 


More Telugu News