'కుబేర' సినిమా పైర‌సీపై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు

  • పీవీఆర్ మాల్‌లో అక్ర‌మంగా రికార్డు
  • సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్‌ ఫిర్యాదు
  • ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు
టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌, త‌మిళ స్టార్‌ హీరో ధ‌నుశ్ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ ఇటీవ‌ల వ‌చ్చిన సినిమా కుబేర‌. ఈ సినిమా ఆన్‌లైన్ పైర‌సీని అరిక‌ట్టాల‌ని తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్  హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 

ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో యాంటీ వీడియో పైర‌సీ సెల్‌, క్యూబ్ డిజిట‌ల్ సినిమా పైర‌సీ మూలాల‌ను గుర్తించ‌డానికి వాట‌ర్ మార్కింగ్ టెక్నాల‌జీల‌ను ఉప‌యోగిస్తూ పైర‌సీని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్‌ ఫిర్యాదులో పేర్కొంది. 

సెంట్ర‌ల్ మాల్ లో పీవీఆర్ థియేట‌ర్ స్క్రీన్-5లో చ‌ట్ట‌విరుద్ధంగా సినిమాను రికార్డు చేసిన‌ట్లు గుర్తించిన‌ట్లు తెలిపింది. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఫిర్యాదు మేర‌కు అధికారులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 2న సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఏడాదిన్న‌ర‌లో 40 సినిమాల‌ను పైర‌సీ చేసిన కిర‌ణ్ కుమార్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.    


More Telugu News