రాజకీయాలు మా ఇంట్లోకి రావు... ఆఫీసులో పర్సనల్ మ్యాటర్స్ రావు: మంత్రి నారా లోకేశ్
- ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారా లోకేశ్
- ఆసక్తికర విషయాలు పంచుకున్న మంత్రి
- ఐదేళ్లు కుటుంబ వ్యాపారంలో పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
తన కెరీర్ లో తల్లి నారా భువనేశ్వరి పాత్రను కూడా ప్రస్తావించారు. "మా అమ్మ నా పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. నా ఎదుగుదల కోసం అన్ని రకాలుగా త్యాగం చేసింది. నా చదువు, కెరీర్ మరియు ఇతర అంశాల్లో నాకు మార్గదర్శనం చేసింది" అని వివరించారు.
ఇక తమ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. అప్పటినుంచి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని తెలిపారు.