Nara Lokesh: రాజకీయాలు మా ఇంట్లోకి రావు... ఆఫీసులో పర్సనల్ మ్యాటర్స్ రావు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Politics Dont Enter My Home Personal Matters Not in Office
  • ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారా లోకేశ్
  • ఆసక్తికర విషయాలు పంచుకున్న మంత్రి
  • ఐదేళ్లు కుటుంబ వ్యాపారంలో పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ 'ఇండియా టుడే' పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు., ఇంట్లో, ఆఫీస్‌లో తన తండ్రి చంద్రబాబును ఎలా పిలుస్తారనే విషయంపై స్పందించారు. "కింద ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా బాస్. పై ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా నాన్న. రాజకీయాలు ఇంట్లోకి రావు, ఆఫీస్‌లోకి పర్సనల్ మేటర్స్ రావు. అవి మేము గీసుకున్న కచ్చితమైన హద్దులు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను నాన్నా అని పిలుస్తాను. 

తన కెరీర్ లో తల్లి నారా భువనేశ్వరి పాత్రను కూడా ప్రస్తావించారు. "మా అమ్మ నా పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. నా ఎదుగుదల కోసం అన్ని రకాలుగా త్యాగం చేసింది. నా చదువు, కెరీర్ మరియు ఇతర అంశాల్లో నాకు మార్గదర్శనం చేసింది" అని వివరించారు. 

ఇక తమ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. అప్పటినుంచి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని తెలిపారు. 
Nara Lokesh
Chandrababu Naidu
Nara Bhuvaneshwari
Andhra Pradesh Politics
Telugu Desam Party
India Today Podcast
Family Business
Political Career

More Telugu News