IND Women vs ENG Women: భార‌త్ ప‌రాజ‌యం.. సిరీస్ స‌మం చేసిన ఇంగ్లండ్

ENG Women won by 8 wickets in DLS method
షార్ట్స్‌లో చూడండి
లార్డ్స్ వేదిక‌గా భారత్‌, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య జ‌రిగిన రెండో వన్డేలో ఆతిథ్య జ‌ట్టు విజ‌యం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ వన్డేలో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం) ఘన విజయాన్ని న‌మోదు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. మొద‌ట టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా ప్రారంభ‌మైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. 

ఇక‌, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త జ‌ట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. టీమిండియాను కట్టడి చేయడంలో ఇంగ్లండ్ బౌల‌ర్లు సఫలమ‌య్యారు. ఎకల్‌స్టోన్‌(3/27), అర్లాట్‌(2/26), లిన్సె స్మిత్‌(2/28) ధాటికి భార‌త్ స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మందన(42), దీప్తిశర్మ(30 నాటౌట్‌) రాణించారు. మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. 

కాగా, వర్షం అంతరాయంతో ఇంగ్లండ్ ల‌క్ష్యాన్ని 24 ఓవర్లకు 115 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను ఆతిథ్య జ‌ట్టు 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో అమీ జోన్స్‌(46 నాటౌట్‌), టామీ బ్యూమౌంట్‌(34) బ్యాట్ ఝుళిపించారు. టీమిండియా బౌల‌ర్ల‌లో క్రాంతిగౌడ్‌, స్నేహ్‌రానా ఒక్కో వికెట్‌ తీశారు.

సంక్షిప్త స్కోర్లు
భారత్‌: 29 ఓవర్లలో 143/8 (మందన 42, దీప్తిశర్మ 30 నాటౌట్‌, ఎకల్‌స్టోన్‌ 3/27, అర్లాట్‌ 2/26).
ఇంగ్లండ్‌: 21 ఓవర్లలో 116/2 (జోన్స్‌ 46 నాటౌట్‌, బ్యూమౌంట్‌ 34, స్నేహ్‌రానా 1/12, క్రాంతి 1/29).
Go Back to Shorts
IND Women vs ENG Women
Indian Women's Cricket Team
England Women's Cricket Team
India vs England
Lord's
Smriti Mandhana
Deepti Sharma
England win
Women's ODI
Cricket series
Alice Davidson-Richards

More Telugu News