నారా లోకేశ్ పర్యవేక్షణలో సుపరిపాలనలో తొలి అడుగు... 18 రోజుల్లో 50 లక్షల ఇళ్ల సందర్శనతో టీడీపీ రికార్డ్ 

  • ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి 
  • సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టిన టీడీపీ
  • ప్రతి ఇంటికీ టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు
  • ప్రజల నుంచి ఆత్మీయ స్పందన 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో, సుపరిపాలనలో తొలి అడుగు పేరిట డోర్ టు డోర్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, వారి అభిప్రాయాలు, సలహాలు సేకరిస్తోంది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో, సాంకేతికత సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. జులై 2న కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  మంగళగిరిలో నారా లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రతి ఇంటికీ వెళుతున్న టీడీపీ శ్రేణులు
గత 18 రోజుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు 50 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్, దీపం 2 వంటి పథకాల గురించి వివరిస్తున్నారు. అంతేకాక, ప్రజల నుంచి విలువైన సలహాలు, అభిప్రాయాలు సేకరిస్తూ, పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఆత్మీయ స్పందన లభిస్తోంది.

సాంకేతికతతో సమర్థవంతమైన నిర్వహణ
మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాంకేతికతతో సమర్థవంతంగా నడుస్తోంది. డ్యాష్‌బోర్డ్ ద్వారా కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. SMS, IVRS వంటి వ్యవస్థల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ వినూత్న విధానం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్లను కవర్ చేయగలిగారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.

విజన్ 2047: స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం
సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ, విజన్ 2047తో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా టీడీపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, రాబోయే అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి నమ్మకాన్ని మరింత చేరుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలో కరపత్రాల రూపంలో సమాచారాన్ని అందిస్తూ, ప్రజలతో సమగ్ర సంబంధాన్ని ఏర్పరుస్తోంది.




More Telugu News