న్యూయార్క్‌లో రూ. 263 కోట్లు పలికిన డైనోసార్ శిలాజం
- శిలాజాన్ని వేలం వేసిన సోథ్ బీ సంస్థ
- 30.5 మిలియన్ డాలర్లు పలికిన డైనోసార్ శిలాజం
- ప్రపంచంలో మూడో అత్యంత విలువైన డైనోసార్ అస్థిపంజరం
న్యూయార్క్ నగరంలో ఒక పురాతన డైనోసార్ శిలాజాన్ని వేలం వేయగా అది 30.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 263 కోట్లు. సోథ్ బీ సంస్థ ఇటీవల నిర్వహించిన అరుదైన వస్తువుల వేలంలో ఈ డైనోసార్ శిలాజం కూడా ఉంది. దీనికి వేలం నిర్వహించగా ఊహించని రీతిలో భారీ ధర పలికింది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన డైనోసార్ అస్థిపంజరాలలో ఇది మూడవదిగా నిలిచింది. గత ఏడాది జూలైలో జరిగిన వేలంలో అపెక్స్ అనే డైనోసార్ శిలాజం 44.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 380 కోట్లు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ డైనోసార్ శిలాజాన్ని ఎవరు కొనుగోలు చేశారో వేలం నిర్వాహకులు వెల్లడించలేదు. ఇది సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని వారు తెలిపారు.