Hari Hara Veera Mallu: ఏపీలో 'హరి హర వీరమల్లు' సినిమా టికెట్ ధరల పెంపు

Pawan Kalyans Hari Hara Veera Mallu gets AP ticket price hike approval
  • ఈ నెల 24న విడుదల కాబోతున్న 'హరి హర వీరమల్లు'
  • తొలి 10 రోజులు రేటు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి
  • తెలంగాణలో కూడా టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి లభించే అవకాశం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. 

సినిమా విడుదలైన తొలి రెండు వారాల పాటు రేటు పెంచుకోవడానికి అనుమతించాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. అయితే, తొలి 10 రోజులకు రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. 

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ పై రూ. 100, అప్పర్ క్లాస్ టికెట్ పై రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో రూ. 200 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అంతేగాకుండా, విడుదలకు ముందురోజు రాత్రి (జులై 23) పెయిడ్ ప్రీమియర్ షోకు కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600.... జీఎస్టీ అదనం.

మరోవైపు తెలంగాణలో కూడా టికెట్ ధరలను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నిర్మాత అర్జీ పెట్టుకున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి. 
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Nidhi Agarwal
Krish Jagarlamudi
AM Ratnam
AP Government
Movie Ticket Prices
Telugu Cinema
Ticket Hike
Harahara Veeramallu

More Telugu News