Anand Mahindra: మున్ముందు ఏం జరగనుందో చూద్దాం... లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Thanks Nara Lokesh for AP Investment Opportunity
  • కొత్త ట్రక్కుల యాడ్ ను నిన్న సోషల్ మీడియాలో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
  • ఆనంద్ మహీంద్రా తెలుగులో చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన లోకేశ్
  • ఏపీలో మహీంద్రా పరిశ్రమ స్థాపించాలంటూ ఆహ్వానం
  • నేడు స్పందించిన ఆనంద్ మహీంద్రా
  • ఇప్పటికే తమ బృందాలు చర్చలు జరుపుతున్నాయని వెల్లడి
మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా తమ తెలుగు అడ్వర్టయిజ్ మెంట్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. తెలుగులో చేసిన ఈ ట్వీట్ ను ఏపీ మంత్రి నారా లోకేశ్ రీట్వీట్ చేసి, ఆ యాడ్ బాగుందంటూ కితాబిచ్చారు. ఏపీలో పరిశ్రమ స్థాపనకు అన్ని అవకాశాలు ఉన్నాయని, మహీంద్రా సంస్థ దీనిపై ఆలోచించాలని కోరారు. 

దీనిపై నేడు ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. "ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వామ్యం అయితే ఎంతో గర్విస్తాం. సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది... మున్ముందు ఏం జరగనుందో చూద్దాం" అని ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. 
Anand Mahindra
Nara Lokesh
Mahindra
Andhra Pradesh
AP Development
Solar Energy
Micro Irrigation
Tourism
Furio-8 Trucks
Industry Investment

More Telugu News