అప్పట్లో మాకు 12 గుర్రాలు ఉండేవి: అనసూయ
- కుటుంబ సభ్యుల మోసంతో తన తండ్రి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారన్న అనసూయ
- హైదరాబాద్ రేస్ క్లబ్ లో ట్రైనర్ గా చేశారన్న అనసూయ
- తన తండ్రి అందమే తనకు వచ్చిందన్న అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పట్లో తమకు 12 గుర్రాలు ఉండేవని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అభిమానుల సమావేశంలో ఆమె వృత్తిపరమైన విషయాలతో పాటు కుటుంబ, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
తన కుటుంబం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని ఆమె అన్నారు. కుటుంబ సభ్యుల మోసం కారణంగా తన తండ్రి సుదర్శన్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆయన హైదరాబాద్ రేస్ క్లబ్‌లో ట్రైనర్‌గా పని చేసేవారని, అప్పట్లో తమకు 12 గుర్రాలు ఉండేవని అన్నారు. అయితే, రేస్ కారణంగా ఆర్థికంగా రోజు ఎలా గడిచేదో తెలియని పరిస్థితి ఉండేదని ఆమె వివరించారు.
జీవితంలో స్థిరత్వం చాలా ముఖ్యమని, కానీ మా నాన్న అది అర్థం చేసుకోలేకపోయారని ఆమె పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిలం కావడంతో అబ్బాయి పుట్టలేదన్న బాధ తన తండ్రిలో ఉండేదని ఆమె అన్నారు. తన తండ్రి చాలా అందంగా ఉండేవారని, ఆయన అందమే తనకు వచ్చిందని భావిస్తున్నానని ఆమె చెప్పారు. తన తండ్రి నుండి క్రమశిక్షణ, తల్లి నుండి నిబద్ధత నేర్చుకున్నానని అనసూయ అన్నారు.