పొరుగింటి వ్యక్తిపై దాడిచేసిన టీమిండియా క్రికెటర్ షమీ భార్య.. వీడియో ఇదిగో!

  • పశ్చిమ బెంగాల్‌ బీర్భూమ్ జిల్లాలో ఘటన
  • తన కుమార్తె పేరిట ఉన్న భూమిలో నిర్మాణమే వివాదానికి కారణం
  • ఆ భూమి వివాదంలో ఉండటంతో అడ్డుకున్న పొరుగు వారు
  • పరస్పరం కేసు పెట్టుకున్న జహాన్, దలియా ఖాతూన్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్‌ చిక్కుల్లో పడ్డారు. హసీన్, ఆమె కుమార్తె తనపై దాడి చేశారని, తనను చంపబోయారంటూ పొరుగింటి వ్యక్తి దలియా ఖాతూన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడి, క్రిమినల్ కుట్ర, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హసీన్ జహాన్ పొరుగు వారిపై చేయి చేసుకుంటున్నట్టు కనిపించింది.  

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సూరి పట్టణంలో ఒక భూమి విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కుమార్తె అర్షి పేరిట ఉన్న భూమిలో హసీన్ జహాన్ నిర్మాణ పనులు ప్రారంభించడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. ఇదే విషయమై హసీన్ జహాన్ గతంలో ఆమె పొరుగు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి వివాదంలో ఉందన్న కారణంతోనే పొరుగువారు అడ్డుకుంటున్నట్టు తెలిసింది. హసీన్ కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కేసుకు ప్రతిగా స్థానిక తృణమూల్ నేత, కౌన్సిలర్ భర్త కాజీ ఫర్జుద్దీన్‌పై హసీన్ జహాన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News