ఏపీలో రాబోయే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు: అమరావతి వాతావరణ కేంద్రం
- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచన
ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురు గాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (మన్యం), ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రేపు (ఆదివారం) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చన్నారు. నిన్న ప్రకాశం, ఏలూరు, కృష్ణా, పల్నాడు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ తదితర జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.