Chandrababu Naidu: మామిడి రైతులకు చంద్రబాబు తీపి కబురు

Chandrababu Naidu Announces Rs 260 Crore for Mango Farmers
  • ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు
  • మార్కెటింగ్ సమస్యలతో సతమవుతున్న మామిడి రైతులకు ఊరట
  • నిధులను తోతాపురి మామిడి కొనుగోళ్లకు ఉపయోగించనున్న వైనం
చిత్తూరు జిల్లా మామిడి రైతులకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతుల కోసం రూ. 260 కోట్ల నిధులను విడుదల చేసింది. మార్కెటింగ్ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించనుంది.

ఈ నిధులను తోతాపురి మామిడి కొనుగోలు కోసం వినియోగిస్తారు. రోజుకు రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సబ్సిడీ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. రైతులు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతోంది. ఈ రూ.260 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) విధానం కింద పూర్తి సహాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు, కొనుగోళ్లు  ఆగస్టు వరకు కొనసాగనున్నాయి. ప్రాసెసర్లు మామిడికి కిలోకు రూ.8 నుంచి రూ.12 చొప్పున మద్దతు ధర ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోరింది. 
Chandrababu Naidu
Mango farmers
Chittoor district
Andhra Pradesh government
Mango procurement
Market Intervention Scheme
Agriculture subsidy
Totapuri mango
Farmers welfare
AP News

More Telugu News