Russia Ukraine war: 'అవర్ వాటర్' బాటిళ్లలో విషం.. నీళ్లు తాగి మృతి చెందిన నలుగురు రష్యా సైనికులు

Russian Soldiers Die After Drinking Poisoned Our Water in Ukraine
  • రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రంట్ లైన్‌లోని సైనికులు మృతి
  • ఈ నీళ్లు తాగిన మరికొందరు సిబ్బంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కథనాలు
  • విషం కలిపిన నీటి బాటిళ్ల వెనుక ఉక్రెయిన్ ఉండవచ్చని రష్యా అనుమానం
  • రష్యా అసత్య ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ ఆగ్రహం
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు కొత్త సమస్య వచ్చి పడింది. తమ సైనికులు విషం కలిపిన నీళ్లు తాగి మృతి చెందుతున్నట్లు రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రంట్ లైన్‌లో ఉన్న నలుగురు సైనికులు తోటి వారి ముందే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.

విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే వారు మృతి చెందినట్లు గుర్తించారు. అలాగే, ఇదే నీళ్లు తాగిన చాలామంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల 'అవర్ వాటర్' పేరుతో ఉన్న ఈ నీళ్ల బాటిళ్లు మానవతా సాయం కింద రష్యా ఆక్రమిత దొనెట్క్స్ ప్రాంతానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. క్రిమియాలోని సిమఫెరోపోల్ నుంచి వీటిని పంపించినట్లు గుర్తించారు. అయితే ఈ బాటిళ్లను ఎవరు పంపించారు? సైనికుల చేతికి ఎలా వచ్చాయి? వాటిలో విషం ఎవరు కలిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు క్రిమియా వర్గాలు వెల్లడించాయి.

విషం కలిపిన కుట్ర వెనుక ఉక్రెయిన్ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. సైనికుల డ్రగ్స్ వినియోగాన్ని దాచిపెట్టడానికి మాస్కో అసత్య ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ చెబుతోంది.
Russia Ukraine war
Russian soldiers
Our Water
poisoned water
Donetsk
Simferopol
Crimea

More Telugu News