జగన్ విషం చిమ్ముతున్నారు: పార్థసారథి

  • తమిళనాడులో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేస్తాయన్న పార్థసారథి
  • ఏపీలో స్వార్థపూరిత ప్రతిపక్షం ఉందని విమర్శ
  • జగన్ బాధ్యత గల నాయకుడిగా వ్యవహరించాలని హితవు
తమిళనాడులో రాజకీయ పార్టీలు రాజకీయంగా విభేదించినా... రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని ఏపీ మంత్రి పార్థసారథి అన్నారు. ఏపీలో మాత్రం స్వార్థపూరిత ప్రతిపక్షం ఉందని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం, నీటీపారుదల ప్రాజెక్టుల అంశంలో జరిగిన తప్పిదాలపై ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.

అబద్ధాలే పునాదిగా పబ్బం గడుపుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం 70 శాతం పూర్తయినప్పటికీ... జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని అన్నారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత గల రాజకీయ నాయకుడిగా జగన్ వ్యవహరించాలని హితవు పలికారు.


More Telugu News