Narayana CPI: తెలంగాణ సెంటిమెంట్ ఎగిరిపోయింది: సీపీఐ నారాయణ

Narayana CPI Says Telangana Sentiment is Gone
  • తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర ప్రభుత్వ సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్న నారాయణ
  • తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయడం లేదని వ్యాఖ్య
  • బనకచర్లపై తొలుత మాట్లాడింది తానేనన్న నారాయణ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నదుల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే ప్రాజెక్టులపై ముందుకు వెళ్లాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఎగిరిపోయిందని... ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి సెంటిమెంట్లు లేవని అన్నారు. 

రేవంత్ రెడ్డి ప్రజలచేత ఎన్నుకోబడిన నేత అని... నామినేట్ చేయబడిన వ్యక్తి కాదని నారాయణ చెప్పారు. పొట్టివాడు గట్టివాడు అని కితాబునిచ్చారు. తెలంగాణకు రేవంత్ ఎలాంటి అన్యాయం చేయలేదని అన్నారు. రేవంత్ ను విమర్శిస్తూ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. నీళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం... తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం వంటిదేనని అన్నారు.

బనకచర్లపై తొలుత మాట్లాడింది తానేనని నారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు కొంచెం అతిగా మాట్లాడారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే బనకచర్లను తెరపైకి తెచ్చారని అన్నారు. తొలుత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచించారు. బనకచర్ల ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదని అన్నారు. ఇది రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టు కాదని... రూ. 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాలు వివాద రహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని హితవు పలికారు.
Narayana CPI
CPI Narayana
Telangana Sentiment
Revanth Reddy
BRS Party
Telangana Water Dispute
AP Telangana
Banaka Cherla Project
Chandrababu Naidu

More Telugu News