నాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన భానుపై చర్యలు తీసుకోండి: రోజా
- రూ. 2 వేలు ఇస్తే ఏమైనా చేసేదని భాను అన్నారన్న రోజా
- వ్యాంప్ కు ఎక్కువ అని నీచంగా మాట్లాడారని ఆవేదన
- చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పై మాజీ మంత్రి రోజా జాతీయ మహిళా కమిషన్ కు, ఏపీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రూ. 2 వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేసేదని... అలాంటి రోజా ఇప్పుడు రూ. 2 వేల కోట్లు సంపాదించిందని తన గురించి భాను ప్రకాశ్ చులకనగా మాట్లాడారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనను వ్యాంప్ కు ఎక్కువ... హీరోయిన్ కు తక్కువని నీచమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ గురించి ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడిన భాను ప్రకాశ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు గాలి భాను తనను దుర్భాషలాడుతూ బాధ పెట్టారని రోజా అన్నారు. ఇది కేవలం తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని... అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించేందుకు ధైర్యం చేసిన ప్రతి మహిళపై జరిగిన దాడి అని చెప్పారు. ఇది ఒక ప్రమాదకరమైన సంస్కృతి అని అన్నారు.