Nina Kutina: రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రియుడు

Nina Kutina Russian woman boyfriend Dror Goldstennin arrives from Israel
  • గోకర్ణ సమీపంలోని ఓ గుహలో మహిళ రహస్య జీవనం
  • గుర్తించి ఆమె, ఇద్దరు పిల్లలను రక్షించిన పోలీసులు
  • గోవాలో ఇద్దరం కలిసి పనిచేసేవారమన్న ప్రియుడు స్టెనిన్
  • ఆ సమయంలోనే ఇద్దరం ప్రేమించుకున్నామన్న వ్యాపారవేత్త
  • ఆమెను కలిసేందుకు పోలీసుల అనుమతి కోరిన స్టెనిన్
కర్ణాటక గోకర్ణ సమీపంలోని ఓ గుహలో గుర్తించిన రష్యా మహిళ నీనా కుటినా (40), పిల్లల కోసం ఆమె ప్రియుడుగా చెబుతున్న డ్రోర్ గోల్డ్ స్టెనిన్ (38) నిన్న ఇజ్రాయెల్ నుంచి బెంగళూరు చేరుకున్నాడు. పోలీసులను కలిసి నీనాతో మాట్లాడాలనుకుంటున్నట్టు చెప్పాడు. నీనా, పిల్లలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించాడు. 

గోవాలో నీనా, తాను ఒకే కంపెనీలో పనిచేసేవారని, ఆ సమయంలో ఇద్దరం ప్రేమించుకున్నట్టు స్టెనిన్ తెలిపాడు. కుమార్తెలు జన్మించిన తర్వాత కూడా ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పాడు. పనిపై గతేడాది ఇజ్రాయెల్ వెళ్లానని, అక్కడి నుంచి కూడా తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లమని వివరించాడు. కుటుంబ నిర్వహణ కోసం తాను ప్రతి నెల ఆమెకు రూ. 3.5 లక్షలు పంపేవాడినని తెలిపాడు. అయితే, మార్చి నుంచి నీనా తన ఫోన్‌కు స్పందించడం మానేసిందని, దీంతో తాను పనాజీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేసుకున్నాడు. 

గోకర్ణ సమీపంలోని గుహలో రహస్యంగా జీవిస్తున్న నీనా, పిల్లలను పోలీసులు రక్షించారని తెలిసి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. తన పిల్లలను ప్రకృతి మధ్య పెంచాలని తరచూ చెప్పేదని, అందుకే ఆమె అడవిలోకి వెళ్లి ఉండొచ్చని స్టెనిన్ వివరించాడు.
Nina Kutina
Russia woman
Israel boyfriend
Karnataka Gokarna
Dror Goldstennin
Panaji police
Goa
Children
Forest cave

More Telugu News