KTR: నాపై ఒక్క డ్రగ్స్ కేసైనా ఉందా.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ ఆగ్రహం

KTR demands apology from Revanth Reddy over drug allegations
  • తనకు డ్రగ్స్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్న
  • ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్
  • అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని హెచ్చరిక
"నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదై ఉందా? అలాంటి కేసులతో నాకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉంటే దమ్ముంటే బయటపెట్టు" అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నేరుగా తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్‌చాట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్‌చాట్ పేరుతో తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ రెడ్డికి ఇది కొత్తేమీ కాదని విమర్శించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. క్షమాపణలు చెప్పకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana
BRS
Drugs Case
Defamation
Court Case
Apology
Politics

More Telugu News